Relationship tips: ఈ చిన్న అబద్దాలు..భార్యాభర్తల బంధాన్ని పటిష్టం చేస్తాయి!!

ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. భార్య భర్తలు కలిసి ఉండడంలో వారిరువురి మధ్య ఉండే అవగాహన లేమి విడాకులు తీసుకునే దాకా వెళుతుంది. అందుకే భార్యాభర్తలు ఎప్పుడైనా వివాహ బంధాన్ని కొనసాగించడానికి కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

భార్య భర్తల బంధంలో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుని,ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగడం భార్యాభర్తల బంధానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే భార్య భర్తల బంధం మరింత దృఢంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న విషయాలలో అబద్దాలు చెప్పినా తప్పులేదని చెబుతున్నారు ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తున్న డాక్టర్లు, అడ్వకేట్లు. ఇక ఆ విషయాలు ఏంటో మనం ప్రస్తుతం తెలుసుకుందాం.

bedroom

భార్యాభర్తల బంధాన్ని ఒక్కొక్కసారి బలోపేతం చేయడానికి చిన్నచిన్న అబద్దాలు చెప్పడం ఏమాత్రం తప్పుకాదు.జీవిత భాగస్వామి నుంచి అపారమైన ప్రేమను పొందాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇక ఆ ప్రేమను చిన్న చిన్న మాటలతో కూడా వ్యక్తం చెయ్యొచ్చు. ఇంటి నుంచి ఆఫీస్ వెళ్లిన భర్త మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లే లోపు భార్యకు ఎలా ఉన్నావు.. ఐ మిస్ యు అని మెసేజ్ చేస్తే ఆ భార్య ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది.

భర్తకు భార్య మెసేజ్ చేసినా తను కూడా అలాగే ఫీల్ అవుతాడు. ఇది చిన్న విషయమే అయినప్పటికీ వారిలో ఒకరి పై ఒకరికి ప్రేమను పెంచుతుంది. ఇక భార్య చక్కగా రెడీ అయితే భర్త, భర్త వేసుకున్న డ్రెస్ బాగుంటే భార్య మాటల ద్వారా వ్యక్తం చేయడం మంచిది. జీవిత భాగస్వామిని, వారి అందాన్ని పొగుడుతూ ఉండటం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడడానికి కారణమౌతుంది.

bedroom

వంట చేసే విషయంలో భార్య వంటలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ భర్త ఆ వంట బాగుందని మెచ్చుకుంటే భార్య సంతోష పడుతుంది. అలా కాకుండా లోపాలు వెతికితే జీవిత భాగస్వామి బాధకు గురి అవుతుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, ఆ ఇచ్చిన బహుమతులు నచ్చినా నచ్చకున్నా భాగస్వామి ప్రేమతో ఇచ్చింది కాబట్టి మెచ్చుకోవడం ఎంతో అవసరం.

ఇవన్నీ భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. ఇంటి పనుల్లో భార్యను, ఆఫీస్ పనుల్లో భర్తను నీకు నువ్వే సాటి అని మెచ్చుకుంటే వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే దాంపత్య జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+