భార్య నగ్న వీడియోలు ఇంటర్నెట్‌లో -ఈజీ మనీ కోసం ఓ భర్త వికృతం -గుంటూరు దిశ స్టేషన్‌లో కేసు

పనిపాటా చేయకుండా కూర్చున్న చోట నుంచే డబ్బులు సంపాదించాలనే వెధవ ఆలోచనతో కట్టుకున్న భార్యకే ద్రోహం తలపెట్టాడో నీచుడు. ఆమెతో ఏకాంతంగా కలిసున్నప్పుడు ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసి, వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడం ద్వారా డబ్బులు దండుకోవాలనుకున్నాడు. భర్త వికృత నిర్వాకం తెలిసి షాక్ తిన్న ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది..

గుంటూరు దిశా పీఎస్‌లో..

గుంటూరు దిశా పీఎస్‌లో..

గుంటూరు సిటీ దిశా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ఏటీ అగ్రహారానికి చెందిన ఓ మహిళ కొద్ది గంటల కిందట తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ పనీ చేయకుండా, కేవలం యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని అతను తాపత్రయపడే వాడని, ఈ క్రమంలో తనతో గడిపిన దృశ్యాలను కూడా ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

రంగంలోకి ఐటీ బృందం..

రంగంలోకి ఐటీ బృందం..

మహిళలపై అకృత్యాలను నివారించడం, నేరస్తుల పని పట్టడమే ధ్యేయంగా ఏపీలో దిశా చట్టం అమలవుతున్న సంగతి తెలిసిందే. బాధిత భార్య ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దిశ స్టేషన్ అధికారులు కేసు దర్యాప్తును యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. ఇప్పటీకే పోలీస్ ఐటీ కోర్‌ బృందం.. ఆ వీడియోలు ఇంటర్నెట్ నుంచి తొలగించే పనిలో నిమగ్నమైంది. అయితే..

Recommended Video

    AP Grama Volunteer Recruitment 2020 Notification & Posts Details | Oneindia Telugu
    పోర్న్‌సైట్‌లకూ పంపాడా?

    పోర్న్‌సైట్‌లకూ పంపాడా?

    బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు కీచక భర్త ఆ వీడియోలను కేవలం యూట్యూబ్ లోనే అప్ లోడ్ చేశాడా, లేక ఇతర పోర్న్ సైట్ లకు కూడా పంపాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు అర్బన్‌ పోలీసు ఉన్నతాధికారి స్వయంగా ఈ కేసును పరిశీలిస్తున్నారు. మహిళలపై ఈ తరహా వేధింపులను సహించబోయేది లేదని, బాధితురాళ్లు ముందుకు వస్తే, వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ, నిందితుల పని పడతామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+