బాబు దూరం పెట్టారు: కోడెల మరణంపై తెలంగాణ అసెంబ్లీ అవరణలో వైసీపీ ఎమ్మెల్యే, కేటీఆర్‌తో భేటీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, ఆయన తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో కూడా భేటీ అయినట్లు సమాచారం.

రెండు రాష్ట్రాలకు మేలు..
అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా రాంభూపాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. రెండు రాస్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునేవారనని అన్నారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను కొడుతున్నారా?
రాష్ట్రం విడిపోయాక రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని వాపోయారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపీ కొడుతున్నారనడం సరికాదని అన్నారు. తన తండ్రి వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ సుపరిపాలన అందించేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు.

బాబు దూరం పెట్టడం వల్లే..
ఇక ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై స్పందిస్తూ.. కోడెల మరణానికి టీడీపీ కారణమని ఆరోపించారు. గత కొద్ది రోజుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కోడెలను దూరం పెట్టారని అన్నారు. టీడీపీ కార్యక్రమాలకు కోడెలను పిలవలేదని అన్నారు.

తప్పు చేస్తే చర్యలు తప్పవు..
కోడెలపై ఏపీ సర్కారు తప్పుడు కేసులు పెట్టారనడం సరికాదని వ్యాఖ్యానించారు. కొంత మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఎవరు తప్పు చేసినా శిక్షపడుతుందని స్పష్టం చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications