గల్లీకి చేరిన గలీజ్ దందా.. మసాజ్ పేరుతో వలపు వల.. ఆపై బెదిరింపులు
ముంబై.. హైదరాబాద్‌కే పరిమితమైన మసాజ్ సెంటర్ల ఆగడాలు .. ఇప్పుడు విజయవాడకు చేరాయి. ఈ గలీజ్ దందా గల్లీ గల్లీకి కామన్ అయిపోయింది. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డిని .. మసాజ్ సెంటర్స్ ప్రతినిధులు వేధింపులకు గురి చేశారు. రిలాక్సేషన్ కోసం హెడ్ మసాజ్.. బాడీ మసాజ్ కోసం లోపలకు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డికి అమ్మాయిలతో వలవేశారు. వాళ్లు అతన్ని మాటలతో మాయచేసి అందంతో కైపెక్కించారు.

మగువల కౌగిలిలో..
మసాజ్ మాటున రాసలీలలకు తెరదీశారు. అతను మగువల కౌగిట్లో బందీ అవ్వగానే సీక్రెట్‌గా సీసీ కెమెరాల్లో బంధించారు. విషయం తెలియని శ్రీకాంత్‌రెడ్డి .. నిర్వాహకుల గాలానికి చిక్కాడు. మసాజ్ సెంటర్‌లో పని పూర్తికాగానే .. ఇంటికివెళ్లి రిలాక్స్ అవుతున్న సమయంలో అతని వాట్సాప్ మెసేజ్‌కు రాసలీలల వీడియోలను పంపించి బెదిరించారు. మెసేజ్ ఇక్కడితో ఆగిపోవాలంటే .. డబ్బులు ముట్టజెప్పాలంటూ బెదిరించారు. లేదంటే వీడియోలను కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలోనూ వైరల్ చేస్తామంటూ భయపెట్టారు.

కనికరించని వైనం..
తన వద్ద డబ్బులు లేవని ప్రాధేయపడినా... వాళ్లు కనికరించలేదు. చేసేది లేక చివరకు శ్రీకాంత్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు .. జరిగినదంతా సెల్ఫీ వీడియో తీశాడు. విజయవాడలో మసాజ్ సెంటర్స్‌లో జరుగుతున్న ఘటనలపై పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారట. అందుకే మసాజ్ సెంటర్స్ చాటున మాయలీలలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు మాసాజ్ సెంటర్స్‌పై నిఘా పెంచాలని నగర వాసులు కోరుతున్నారు.

జీవితాలు ఛిద్రం
మసాజ్ సెంటర్స్ పేరుతో యువకుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. బంగారు భవిష్యత్ ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే మరికొంత మంది జీవితాలు ఆగమైపోయే అవకాశం ఉంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications