ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై దుష్ప్రచారం: త్వరలోనే తేలుస్తా..క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండండి
గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని- తెలుగుదేశం పార్టీకి చెందినట్లుగా అనుమానిస్తోన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చక్కర్లు కొడుతోన్న ఓ ఆడియో క్లిప్ దుమారం రేపుతోంది. ఈ ఆడియో క్లిప్‌ను సర్కులేట్ చేస్తోన్న వారిపై అంబటి రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి ఒక వర్గానికి చెందిన వారు సాగిస్తోన్న దుష్ప్రచారంగా ఆయన అభివర్ణించారు.
రాజకీయ ప్రత్యర్థులే తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని తరహా దుష్ప్రచారం చేస్తోన్నారంటూ అంబటి రాంబాబు అనుచరులు ఆరోపిస్తోన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చేస్తోన్న ఈ దుష్ప్రచారం పట్ల అంబటి రాంబాబు స్పందించారు. ఆ ఆడియో క్లిప్‌ను సర్కులేట్ చేస్తోన్న వారిని హెచ్చరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో కొద్దిసేపటి కిందటే పోస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఉద్దేశపూరకంగా తనపై దుష్ప్రచారం చేస్తోన్నారని అన్నారు.

ఆ ఆడియోలో వినిపించే గొంతు తనదేనని, తాను మాట్లాడినట్లు భ్రుమింపజేసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని ఎవరు?, ఎందుకు?, ఏ ఉద్దేశంతో సర్కులేట్ చేస్తోన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని చెప్పారు. సుమారు పది సంవత్సరాల కిందట కూడా ఒక ప్రముఖ ఛానల్ తనపై దుష్ర్రచారం చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. దాన్ని తాను న్యాయస్థానంలో ఎదుర్కొన్నానని అన్నారు.
ఆ దుష్ర్పచారం ఘటనలో అది ఛానల్ తప్పుగా విచారణ సందర్భంగా నిరూపణ అయిందని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు- 10, 15 రోజులుగా తనపై దుష్ప్రచారానికి తెర తీశారని చెప్పారు. అందులో భాగంగానే ఆడియోలు, కొన్ని వీడియోలను తయారు చేసి, సోషల్ మీడియా వేదికగా సర్కులేట్ చేశారని అన్నారు. తనను బద్నాం చేయడానికి, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి చేస్తోన్న కుట్రగా పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు.
తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, తన అనుచరులు, పార్టీ క్యాడర్.. ఎవరూ నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నానని అంబటి రాంబాబు అన్నారు. తనపై ఈ తరహా దుష్ప్రచారాన్ని సాగిస్తోన్న వారిపై చట్టపరంగా సివిల్, క్రిమనల్ చర్యలను కూడా తీసుకోబోతోన్నానని హెచ్చరించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.
— Ambati Rambabu (@AmbatiRambabu) August 9, 2021












Click it and Unblock the Notifications