Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

175 లో ఇదొక్కటే మోడల్ నియోజకవర్గం? నేతల అధ్యయనం!

కథానాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. వరుసగా రెండుసార్లు ఇక్కడినుంచి బాలకృష్ణ విజయం సాధించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మోడల్ గా తీసుకోవాలనే భావనలో ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

నియోజకవర్గంలో మార్మోగుతున్న బాలయ్య పేరు

నియోజకవర్గంలో మార్మోగుతున్న బాలయ్య పేరు

2019 ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల వరకు హిందూపురంలో బాలకృష్ణ తరఫున ఇతర వ్యక్తులు కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. అయితే వారిపై అవినీతి ఆరోపణలు వస్తుండటంతో అందరినీ తప్పించి తనకు సన్నిహితులైనవారు, నిజాయితీ పరులైనవారిని తన బాధ్యులుగా నియమించారు. దీంతో నియోజకవర్గానికి బాలయ్య అందుబాటులో ఉండటంలేదు అనే అపప్రథ తప్పిపోయింది. బాలకృష్ణ అందుబాటులో ఉండకపోయినప్పటికీ నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం ఆయన పేరు మార్మోగుతోంది. దీనికి కారణం బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడమేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

అన్ని గ్రామాలకు తిరుగుతున్న మొబైల్ ఆసుపత్రులు

అన్ని గ్రామాలకు తిరుగుతున్న మొబైల్ ఆసుపత్రులు

గత ఎన్నికల్లో త్రిముఖ పోరు ఏర్పడినా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ఈసారి తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడంతోపాటు వాటిని అమలు చేసే విధానంలో నూతన పద్ధతులను పాటిస్తున్నారు. ఇవే ఆయనకు పేరు తీసుకురావడంలో తోడ్పడుతున్నాయి. ముందుగా నియోజకవర్గంలో అన్న క్యాంటిన్ ఏర్పాటు చేశారు. వీటిని నియోజకవర్గ పరిధిలోని అన్ని కేంద్రాలకు తిప్పుతున్నారు. మొత్తం 5 అన్న క్యాంటిన్లు ఏర్పాటయ్యాయి. రూ.2 కే భోజనం వస్తుండటంతో కార్మికులు, పేదవర్గాలు ఇక్కడ కడుపు నింపుకుంటున్నాయి. దీంతోపాటు గ్రామాల్లో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇవి మొబైల్ ఆసుపత్రులు. గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికీ మెరుగైన వైద్యాన్ని చేరవేస్తున్నాయి. చిన్న చిన్న పరీక్షలకే దీన్ని పరిమితం చేయకుండా రూ.లక్ష వరకు ఖర్చయ్యే వైద్యాన్ని నయం చేసేందుకు ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మద్యపానం మానేసేందుకు తరగతులు

మద్యపానం మానేసేందుకు తరగతులు

దీంతోపాటు మద్యపానం, ధూమపానం అలవాటున్నవారికి వాటిని మానిపించేందుకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ రూ.200 ఇస్తున్నారు. ఈ తరగతులకు హాజరై మద్యపానం, ధూమపానం నుంచి విముక్తి పొందుతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. క్యాన్సర్ రోగుల పరిస్థితిని బట్టి, దాని తీవ్రతను బట్టి మెరుగైన వైద్యం కోసం బసవతారం ఆసుపత్రికి పంపిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలతో హిందూపురం మోడల్ నియోజకవర్గంగా మారడంతో తెలుగు తమ్ముళ్లు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు క్యూ కడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+