రైడ్ అని తెలియడంతో కొకైన్ పడేశారు.. కస్టడీలో పబ్ డ్రగ్స్ నిర్వాహకుల ఆన్సర్

బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు కస్టడీ ఇవాళ ముగిసింది. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల నాలుగు రోజుల కస్టడీ సాయంత్రంతో గడిచింది. పబ్ నిర్వాహకుడు అభిషేక్, మేనేజర్ అనిల్‌ను ప్రశ్నించారు. అయితే వారు లేదు, తెలియదు అనే సమాధానం చెప్పారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాచారం మాత్రం రాబట్టలేకపోయారు.

నిందితులు రేపు ఉదయం గం.10-30 లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. కస్టడీ ముగియటంతో నిందితుల తరుఫు న్యాయవాదులు మళ్లీ బెయిల్ పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పోలీసులు కూడా మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

 4 days police custody close in pub drug case

పబ్‌లో రికవరీ అయిన నాలుగు గ్రాముల కొకైన్‌ గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితుల నుంచి తెలియదు అనే సమాధానమే వచ్చింది. రైడ్ చేస్తున్నారు అనే సమాచారంతో కస్టమర్స్ ఎవరో పడేశారు అని అనిల్, అభిషేక్ బదులిచ్చారు. మూడు నెలల నుంచే తాము పబ్‌ను నడుపుతున్నట్లు అభిషేక్ పోలీసులకు చెప్పాడు. అసలు పబ్‌లో డ్రగ్స్ యాక్టివిటి ఉండదని... పోలీసులకు ఎలా దొరికిందో తనకు తెలియదు చెప్పాడు.

కస్టమర్స్‌కు కమ్యుూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకే పామ్ అనే సాప్ట్ వేర్ వాడినట్టు అభిషేక్ వివరించాడు. ఈనెల 3వ తేదీన లేట్ నైట్ పార్టీకి ఎక్కువ మంది కస్టమర్స్ రావడం వాస్తవం అని నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసులో నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఇతర ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చింది. మొత్తం 140 మందికి పైగా పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+