స్థానికులకే పెద్దపీట: 95 శాతం కొలువులు వారికే: మంత్రి కేటీఆర్

నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నూతన జోనల్ వ్యవస్థతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే లభిస్తాయని తెలిపారు. ఇక స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు.

నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ ఆమోదించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన తర్వాత.. నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు.

95 per cent jobs are local: ktr

ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రం ఆక‌ర్షించింద‌ని కేటీఆర్ తెలపారు. సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలలో ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్నామ‌ని కేటీఆర్ వివరించారు.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు, యువత పక్షాన కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకి అందించామ‌ని కేటీఆర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+