బంజారాహిల్స్ ప్లేజోన్‌లో ప్రమాదం: తెగిపడిన చిన్నారి చేతివేళ్లు
హైదరాబాద్: ఆదివారం సరదాగా ఆడుకుందామని వచ్చిన ఓ చిన్నారి చేతివేళ్లు తెగడం కలచివేసింది. ఓ ప్లే మెషీన్లో చేయి పెట్టడంతో చిన్నారి చేతివేళ్లు తెగిపడ్డాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని సిటీ సెంటర్ మాల్‌లో జరిగింది. స్మాష్ జోన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రమాదానికి గురైందని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన మెహతా జహాన్, మహియా బేగంతో కలిసి బంజారాహిల్స్ సిటీ సెంటర్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియా ప్రాంతానికి ముగ్గురు పిల్లను తీసుకెళ్లారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అక్కడ తెరిచి ఉన్న ఒక యంత్రంలో మెహ్విష్ లుబ్నా(3) అకస్మాత్తుగా చేయి పెట్టింది. యంత్రంలో పడి చిన్నారి మూడు చేతివేళ్లు, చూపుడు వేలు కొంత భాగం నలిగిపోయాయి.

కాగా, వైద్యులు చిన్నారి కుడి చేతి మూడు వేళ్లను తొలగించారు. పూర్తిగా నలిగిపోయాయని, చేతి వేళ్లను తిరిగి అతికించడం సాధ్యం కాదని వైద్యలు తెలిపారు. కాగా, ఘటనపై చిన్నారి తండ్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన సమయంలో మాల్ నిర్వాహకులు, స్మాష్ జోన్ సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా స్మాష్ జోన్లో ఆడుకుంటున్న పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది అందుబాటులోకి రాలేదన్నారు.
ఈ ఘటన పూర్తిగా భద్రతా వైఫల్యమేనని అన్నారు. యంత్రం వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోలేదని.. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. సీసీటీవీ ఫుటేజీ కోసం నిర్వాహకులను సంప్రదించినప్పుడు వారు సంఘటనా ప్రాంతంలోని వారు సంఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని తొలగించారని బాధితులు ఆరోపించారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఫుటేజీ తమ వద్ద లేదని చెప్పారన్నారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సిటీ సెంటర్ మాల్ మేనేజ్‌మెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు బాలిక తండి. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications