Student Heart attack: గుండెపోటుతో ఎంబీఏ విద్యార్థి మృతి..

ప్రస్తుత జీవన విధానంతో వయస్సతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. గతంలో పెద్ద వయస్సు వారికే ఎక్కువగా గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 10 ఏళ్ల వయస్సు నుంచి 70, 80 ఏళ్ల వయస్సు వారికి కూడా గుండెపోటు వస్తుంది. గత ఏప్రిల్ లో మహబూబాబాద్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయాడు.

ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. అంతకు ముందు ఓ వ్యక్తి పెళ్లి హల్దీ ఫంక్షన్ లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చనిపోయాడు. ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లి డ్యాన్స్ చేస్తూ వేదికపైన కిందపడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ మధ్యే గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు గుండెపోటుతో మరణించాడు.

A student doing MBA in Hyderabad died of heart attack

తాజాగా హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌లో గుండెపోటుతో ఓ విద్యార్థి చనిపోయాడు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కుశాల్‌ అనే విద్యార్థి హాస్టల్‌లో గదిలో హార్ట్‌ఎటాక్‌తో మృతి చెందాడు. మైసమ్మగూడలో కుశాల్‌ ఉంటున్నాడు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. విశాల్ ఆదివారం రాత్రి బాత్ రూమ్ కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్నేహితులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విశాల్ మృతి చెందాడు.

మరో ఘటనలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని అల్కాపూర్‌ కాలనీలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ త్రిపురాది మణిరాజ్‌ హార్ట ఎటాక్ తో చనిపోయినట్లు తెలిసింది. దీంతో గుండె నొప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి తగినంత శ్రమను కల్పించాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+