Nitu Bhai: ఎవరీ నీతు బాయ్.. ఆమె వెనక ఉన్నది ఎవరు..!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ మహిళ భారీగా గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమె పేరే నీతు బాయ్. ఆమె నానక్ రాంగూడలో బహిరంగంగా గంజాయి విక్రయించడం అందరినీ ఆశ్ఛర్యానికి గురి చేసింది. అయితే సదరు మహిళకు భారీగా నేర చరిత్ర ఉందని.. అందుకే ఆమె ధైర్యంగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది.
సిద్దిపేట జిల్లా ములుగు ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. దీంతో వారిని విచారించగా.. నానక్ రాంగూడలో గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు నానక్ రాం గూడకు వెళ్లారు. అక్కడ నీతు బాయ్ గంజాయి అమ్ముతూ కనిపించింది. గంజాయి కోసం దాదాపు 20 మంది లైన్ లో ఉన్నట్లు కనిపించింది. పోలీసులు నీతు బాయ్ కి కొంత మొత్తం చెల్లించి గంజాయి తీసుకన్నారు.

ఆ తర్వాత నీతు బాయ్ ఇళ్లు ఎక్కడుంది. ఇంటి వద్ద గంజాయి ఉందా అనేది ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత సిద్దిపేట పోలీసులు తెలంగాణ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (టీన్యాబ్) డైరెక్టర్ సందీప్‌శాండిల్యకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన సైబరాబాద్ కమిషనర్ కమిషనర్ అవినాశ్‌మహంతి సహకారంతో బృందాన్ని ఏర్పాటు చేశారు. నీతు బాయ్ ఇంటికి పంపారు. దీంతో అక్కడ ఆమె కొందరికి గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది. దీంతో ఆమెను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
నిందితురాలి ఇంట్లో గంజాయితోపాటు రూ.16లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే నీతు బాయ్ చాలా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై 2017లో శేరిలింగంపల్లి ఎక్సైజ్ విభాగం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆమెపై పీడీ చట్టం ప్రయోగించిన మారలేదు. సంవత్సరం పాటు జైలులో ఉండి. తిరిగి వచ్చి నేరాలకు పాల్పడుతుంది.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications