రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్ ఫిక్స్ - వరుడు ఎవరంటే : అఫీషియల్ అనౌన్స్ మెంట్- అదే సర్ప్రైజ్...!!
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యమైన ప్రకటన చేసింది. అధికారికంగా తన వివాహం గురించి వెల్లడించింది .తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటన చేసింది. శనివారం జన్మదినం జరుపుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అదే రోజున తనకు మూవీ ఇండస్ట్రీలో ముఖ్యమైన స్నేహితులతో తొలుత ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. బాలీవుడ్ నిర్మాత..నటుడు అయిన జాకీ భగ్నానీతో తన వివాహం జరగనుంది రకుల్ వెల్లడించారు. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను రకుల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసారు.
విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు పలువురు రకుల్ ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. అయితే, వివాహం ఖరారైంది కానీ, ఎప్పుడనేది మాత్రం రకుల్ వెల్లడించ లేదు. తన పెళ్లి గురించి చెబుతూ రకుల్ జీవితంలో తనకు సంతోషాన్ని పంచే సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఏడాది తన జీవితంలో ఇదే గొప్ప గిఫ్ఠ్ గా అభివర్ణించారు. తన జీవితంలో కొత్త రంగులు తీసుకొస్తుందని ఆకాంక్షించారు. తనకు ఇవన్నీ మర్చిపోలేని మెమోరీస్ అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇక, బాలీవుడ్ తో పాటుగా టాలీ వుడ్ లో పలు హిట్ సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. రకుల్ నటించిన సినిమాల్లో ప్రధానంగా మెగా హీరోలతో నటించిన సినిమాల్లో రాం చరణ్ తో కలిసి చేసిన ధ్రువ, అల్లు అర్జున్ తో కలిసి నటించిన సరైనోడు ఉన్నాయి. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన కొండపొలం మూవీ తాజాగా విడుదలైంది. ఈ సినిమా పైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో వైష్ణవ్ తో పాటుగా రకుల్ నటనకు చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు.

Recommended Video
ఇక, తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఒకరుగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్త..హాట్ టాపిక్ గా మారింది. వరుడు ఎవరో తెలుసుకొనేందుకు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రకుల్ పోస్టులకు స్పందన కనిపిస్తోంది. ఒక వైపు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రోజున జరుగుతున్న మా ఎన్నికలు ఒక విధంగా సామాన్య ప్రజలకు ఆసక్తి కరంగా మారాయి. ఇదే సమయంలో రకుల్ పెళ్లి వార్త మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. త్వరోలనే రకుల్ వివాహం జరగనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications