ఏందయ్యా అట్లీ... ఇట్టా తీశావ్?: అల్లు అర్జున్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా విడుదలైంది.. సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఉత్తర భారతదేశపు జనాలంతా ఈ సినిమా దర్శకుడు అట్లీ ఎవరు? గతంలో ఏ సినిమాలు తీశాడు? లాంటి విషయాలను ఆరా తీస్తున్నారు. జవాన్ హిట్ తో హీరోలంతా మరోసారి అట్లీవైపు చూస్తున్నారు. అయితే అట్లీ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైపు చూస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం డైలమాలో పడ్డాడు.

జవాన్ సినిమా యునానిమస్ గా హిట్ టాక్ అందుకుంది. జవాన్ హిట్ అయితే అట్లీతో సినిమా ఫిక్స్ చేద్దామని బన్నీ భావించాడు. సినిమా విడుదలైంది.. హిట్ అయింది.. కానీ బన్నీ మాత్రం ఓకే అనలేకపోతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అట్లీ తీశాడు. తెలుగు, తమిళంలో వచ్చిన సినిమాలన్నింటినీ మిక్సీలో వేసి గట్టిగా రుబ్బాడు. బాలీవుడ్ జనాలకు ఈ తరహా మాస్ మసాలా కథలు కొత్త కాబట్టి ఆదరిస్తున్నారు. షారుక్ ఖాన్ ఇటువంటి కథలో కనిపించడంతోపాటు అనేకరకాల గెటప్పులు వేయడం కూడా కొత్తగా అనిపించింది.

allu arjun and junior ntr friend ship

ఎలివేషన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేయడం లాంటివన్నీ జవాన్ కు కలిసొచ్చాయి. గతంలోనే అట్లీతో బన్నీ సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా నడిచాయి. పుష్ప సినిమా రెండు భాగాలుగా తీయనుండటంతో ఈ కాంబినేషన్ ఆలస్యమైంది. ఎలివేషన్లు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను నమ్ముకొని సినిమా తీయడానికి అల్లు అర్జున్ సిద్ధంగా లేడు. పుష్ప సినిమాతో తనపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకోవాలంటే కథలో దమ్ముండాలి. రెగ్యులర్ కథలతో ప్రతిసారి మ్యాజిక్ చేయలేరు. అట్లీని నమ్మాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయాడు బన్నీ. అల్లు అర్జున్ కాదన్నా అట్లీకి ఎవరో ఒక స్టార్ కచ్చితంగా దొరుకుతాడు. మంచి కథతో వస్తే అట్లీ పని సులభమవుతుందికదా అనే ఆలోచనలో అల్లు అర్జున్ అభిమానులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+