Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. ఆమ్‌స్టర్‌డామ్ కు డైరెక్ట్ ఫ్లైట్..!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త వచ్చిది. తాజాగా మరో ఇంటర్నేషనల్ సిటీకి హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (RGI) విమానాశ్రయం నుంచి ఆమ్‌స్టర్‌డామ్ కు డైరెక్ట్ ఫ్లైట్ నడపనుంది. ఈ విమాన సర్వీస్ అందుబాటులోకి వస్తే నెదర్లాండ్స్ వెళ్లే ప్రయాణీకులు త్వరగా అక్కడికి చేరుకోవచ్చు. ఈ విమాన సర్వీస్ భారతదేశం, ఐరోపా మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది.
కేఎల్ఎమ్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్ కు సెప్టెంబర్ 2, 2025 నుంచి విమాన సర్వీస్ ప్రారంభించనుంది. వారానికి మూడు సార్లు విమానం నడుపుతామని కేఎల్ఎమ్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఈ విమాన సర్వీస్ ప్రారంభం అయితే భారతదేశం నుంచి నెదర్లాండ్స్ నాలుగో విమానం అవుతుంది. ఈ ఎయిర్ లైన్స్ ఇప్పటికే పలు నగరాల నుంచి నెదర్లాండ్స్ విమానాలు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ కు నడిచే విమానం మంగళవారం, శుక్రవారం, ఆదివారం నడపనున్నారు.

KLM బోయింగ్ 777-200ER విమానాన్ని ఈ మార్గంలో నడవనుంది. ఈ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఇది విశాలమైన, సౌకర్యవంతమైన సీటింగ్‌కు ప్రసిద్ధి చెందింది. కేఎల్ఎమ్ బోయింగ్ 777-200ER లో విలాసవంతమైన, అధిక-సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రూపొందించిన 35 సీట్లు ఉంటాయి. ప్రీమియం కంఫర్ట్ క్లాస్ లో 24 సీట్లు ఉంటాయి. ఎకానమీ క్లాస్ లో 229 సీట్లు ఉంటాయి. KL873 విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:40 గంటలకు ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిపోల్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుంది.
మరుసటి రోజు రాత్రి 12:30 గంటలకు హైదరాబాద్‌లోని RGI విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ విమానం KL874 తిరిగి హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 2:20 గంటలకు బయలుదేరి, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:40 గంటలకు ఆమ్‌స్టర్‌డామ్‌కు తిరిగి చేరుకుంటుంది. కేఎల్ఎమ్ RGI విమానాశ్రయం నుంచి వివిధ ప్రముఖ నగరాలకు ప్రత్యక్ష సేవలను అందిస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యక్ష విమానాల జాబితాలో మధ్యప్రాచ్యం, యూరప్, ఆసియా దేశాలకు విమానాలు నడుపుతోది.
RGI విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమా (UAE), మస్కట్ (ఒమన్), దోహా (ఖతార్), జెద్దా, దమ్మామ్, రియాద్ (సౌదీ అరేబియా), కువైట్, లండన్ (UK), ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ), దక్షిణ ఆసియా, కొలంబో (శ్రీలంక), ఢాకా (బంగ్లాదేశ్), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), మలే (మాల్దీవులు), సింగపూర్, కౌలాలంపూర్ (మలేషియా), డాన్ ముయాంగ్ (థాయ్‌లాండ్) నేరుగా విమానాలు నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications