గ్రేటర్ వాసులకు బ్యాడ్ న్యూస్.. మరో 3 రోజులు వర్షాలు, బల్దియా అలర్ట్
నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది.హైదరాబాద్ వాసులకు మరో చేదు వార్త.. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముసురే కాదు.. భారీ వర్షం కూడా పడుతుందట. నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడుతుందని తెలిసింది.
ఇవాళ రాత్రి కూడా హైదరాబాదులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై మ్యాన్ హోల్స్ పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తేలికపాటి వానలకే హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. మరీ రెండు, మూడురోజుల నుంచి వర్షమే.. ఇక ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటీ.. అయితే ఇప్పటికే అలాంటి ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలను చేపడుతున్నారు. అయినప్పటికీ జనం మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. రేపు ఆదివారం అయినందున ప్రాబ్లమ్ లేదు.. కానీ సోమ, మంగళవారాల్లో స్కూల్/ కాలేజీ/ ఆఫీసులకు వెళ్లేవారి పరిస్థితి వర్ణణాతీతంగా ఉండనుంది.
వర్షాల నేపథ్యంలో రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్జప్తి చేశారు. గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అలర్ట్ చేశారు.












Click it and Unblock the Notifications