వద్దంటే వాన: సిటీలో మరో మూడు రోజులు వాన..
ఆగస్ట్ పూర్తవుతున్న వర్షాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అప్పుడే ఎండ.. వాన పడటంతో విచిత్రంగా పరిస్థితి ఉంది. దీంతోపాటు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ జ్వరాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అదీ మరో మూడు రోజులు ఉంటుందని తెలిపింది. నిన్న రాత్రి 9 గంటల వరకు హయత్‌నగర్‌లో అత్యధికంగా 1.2సెం.మీ., ఖైరతాబాద్‌లో 1.0సెం.మీ., శ్రీనగర్ కాలనీలో 1.0సెం.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

వాయుగుండం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అసలే సీజనల్ వ్యాధులు.. జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వర్షం పడటంతో దోమలు నిల్వ ఎక్కువ అవుతుంది. ఇక సిటీలో లోతట్టు ప్రాంతాల గురించి చెప్పక్కర్లేదు. బస్తీల్లో ఉండేవారి పరిస్థితి వర్ణణాతీతం.












Click it and Unblock the Notifications