మరో 3 రోజులు వాన.. 101 శాతం అధికంగా వర్షపాతం..
వర్షం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇక చెప్పక్కర్లేదు. కాసేపు విరామం ఇచ్చిన సరే.. తర్వాత వర్షం పడుతుంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన తెలియజేసింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు తప్పవని స్పస్టంచేసింది. దీంతో రోజువారీ కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు.

జలమయం..
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరక్టర్ నాగరత్నం తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. చత్తీస్‌ఘడ్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండటంతోపాటు ఉపరితల ఆవర్తనం కూడా చురుగ్గా కదులుతుంది.

3 రోజులు వర్షాలు
మరో మూడు రోజులు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు సంవత్సరాల తరవాత మళ్ళీ ఇలాంటి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మన వైపుగా నైరుతి పవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఎగువున కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పడాల్సిన వర్షపాతం కంటే 101 శాతం అధికంగా పడినట్టు తెలుస్తోంది.

వద్దంటే వాన
ప్రస్తుత పరిస్థితిని బట్టి మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం వల్ల వరదనీరు నిల్వడం వల్ల దోమలు ఎక్కువ అవుతాయి. దీని వల్ల జ్వరాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆహారం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే మలేరియా, టైపాయిడ్, వైరల్ జ్వరాలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. సో అందరూ అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ సూచించారు.












Click it and Unblock the Notifications