Unstoppable Chandrababu : బాలయ్య షోలో చంద్రబాబు, లోకేష్-షూటింగ్ కు హాజరు
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహించే Unstoppable టీవీ షో ప్రాచుర్యం పొందింది. ఇందులో ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పాల్గొన్నారు. వారితో బాలయ్య చేసే విన్యాసాలు, వేసే జోకులు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఈసారి మరో విశిష్ట అతిధి ఈ షోలో దర్శనమివ్వబోతున్నారు.
బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఈసారి అతిధులుగా టీడీపీ అధినేత, ఆయన బావ, వియ్యంకులు కూడా అయిన చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ హాజరయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ కు వీరు హాజరైన సందర్శంగా ఉల్లాసంగా కనిపించారు. వీరిని రిసీవ్ చేసుకుంటూ ఆహా నిర్వాహకులు, సిబ్బంది కూడా సంతోషంగా కనిపించారు. స్టూడియోకు హాజరైన చంద్రబాబును గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు.

నిత్యం రాజకీయాల్లో బిజీగా కనిపించే చంద్రబాబు, లోకేష్.. బాలయ్య అన్ స్టాపబుల్ షో షూటింగ్ కు హాజరుకావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, ఇన్నాళ్లకు టైం కుదిరిందని వారు చెప్తున్నారు.

అయితే బాలయ్య షోలో చంద్రబాబు, లోకేష్ రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడారా లేక ఏపీకి సంబంధించిన ఏయే అంశాల గురించి మాట్లాడారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ షో కోసం అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications