• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిలీఫ్: కరక్కాయ బాధితులకు న్యాయం.. సీజ్ చేసిన ఆస్తులు అమ్మకం..?

|
Google Oneindia TeluguNews

కరక్కాయ పేరుతో కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. 2018లో హైదరాబాద్‌లో ఈ మోసం వెలుగుచూసింది. బాధితులను కంపెనీ నట్టేట ముంచిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసుల విచారణ తుది దశకు చేరింది. కేసుపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఈవోడబ్ల్యూ విభాగం పోలీసులు కసరత్తు చేస్తున్నారు. రేపో, మాపో బాధితులకు న్యాయం చేస్తామనే భరోసను ఇస్తున్నారు.

మల్టీలెవల్ మోసం..

మల్టీలెవల్ మోసం..


కరక్కాయ పొడితో మల్టీలెవల్ మోసం చేశారు. 600 మందిని స్కీములో ఇరికించి రూ.7 కోట్ల స్కాం చేశారు. 2018 జూలైలో కుంభకోణం బయటకు వచ్చింది. ముఠాను ఈవోడబ్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఖరీదైన వాహనాలు, ఆస్తులను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని కోర్టు అనుమతతో ఈ వేలం వేసి.. వచ్చిన డబ్బులను బాధితులకు పంచి న్యాయం చేస్తారు. ఇటు రూ.150 కోట్ల సన్ పరివార్ స్కామ్‌లో సీజ్ చేసిన ఆస్తులను సైబరాబాద్ పోలీసులు త్వరలో బాధితులకు న్యాయం చేయడానికి సిద్దమవుతున్నారు. బాధితులు తుది జాబితాను కూడా సిద్దం చేస్తున్నారు. ఈ స్కాం కూడా 2018లోనే వెలుగులోకి వచ్చింది. ఇదేబాటలో కరక్కాయ స్కామ్ బాధితులకు కూడా న్యాయం చేస్తారు.

కాంపిటెంట్ అథారిటీ కమిటీ

కాంపిటెంట్ అథారిటీ కమిటీ


కోర్టు అనుమతితో ప్రత్యేకంగా కాంపిటెంట్ అథారిటీ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సీపీ స్టీఫెన్ రవీంద్రతోపాటు క్రైమ్ డీసీపీ, ఈవోడబ్ల్యూ డీసీపీ కవిత, ఇన్ స్పెక్టర్ భాస్కర్, రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు, రంగారెడ్డి సీఏ ఉంటారు. సీజ్ చేసిన ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయడానికి కాంపిటెంట్ అథారిటీ కమిటీ ఏర్పాటు చేయడం దేశంలో తొలిసారి అని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.

మోసం చేశారిలా..?

మోసం చేశారిలా..?


కిలో కరక్కాయలు 100 రూపాయలు! కిలో కరక్కాయల పొడి తీసుకుంటే రూ.150!! కానీ, వెయ్యి రూపాయలు డిపాజిట్‌ చేస్తే కిలో కరక్కాయలు ఇస్తామని చెప్పారు. వాటిని పొడి చేసి ఆ పొడిని జాగ్రత్తగా తీసుకొస్తే డిపాజిట్‌ చేసిన సొమ్ముకు అదనంగా రూ.300 కలిపి మొత్తం రూ.1300 ఇస్తామని ఆశ చూపించారు. జనాలు ఎగబడ్డారు! మార్కెట్‌లో కరక్కాయల రేటు ఎంత!? కరక్కాయల పొడి కిలో ఎంత పలుకుతోంది!? వంటివి ఆలోచించలేదు. కష్టపడకుండా కరక్కాయలతో కనక వర్షం కురుస్తోందని భావించారు. తొలుత తక్కువ మొత్తాలకు చెప్పిన విధంగా చెల్లింపులు చేయడంతో నమ్మేశారు. ఒకరిని చూసి మరొకరు ఎగబడ్డారు. ఏకంగా వందల మంది ముందుకొచ్చారు. లక్షలకు లక్షలు డిపాజిట్‌ చేశారు. ఒకరు ఏకంగా రూ.40 లక్షల కరక్కాయలు కొన్నాడు! చివరికి, వందల మందిని నమ్మించిన ఆ సంస్థ కరక్కాయతోనే కుచ్చుటోపీ పెట్టింది. కేవలం ఐదు నెలల్లోనే బోర్డు తిప్పేసి రూ.5 కోట్లకు ముంచేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన ఈ మోసం వెలుగు చూసింది.

ప్రకటనలతో మోసం..

ప్రకటనలతో మోసం..


కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌ నంబర్‌-1లోని ఎంఐజీ 165లో 'సాఫ్ట్‌ ఇంటిగ్రేట్‌ మల్టీ టూల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే సంస్థను ఏర్పాటు చేశారు. పత్రికా ప్రకటనలతోపాటు యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా అతి తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే ఉండి భారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ప్రచారం చేశారు. ఆయుర్వేద సంస్థకు కరక్కాయల పొడిని సరఫరా చేయాల్సి ఉందని, తామిచ్చిన కరక్కాయలు తీసుకెళ్లి పొడి చేసి ఇవ్వడమే కస్టమర్లు చేయాల్సిన పని ప్రకటనలు గుప్పించింది. ముందుకొచ్చిన వారి నుంచి రూ.1000 తీసుకుని కేజీ కరక్కాయలు ఇచ్చింది. దానిని పొడి చేసి తీసుకు వచ్చినవారికి ఠంచనుగా రూ.1300 ఇచ్చేసింది. విషయం ఆ నోట ఈ నోటా విన్న స్థానికులు, స్థానికేతరులు ఎగబడ్డారు. పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసేందుకు ముందుకొచ్చారు. అప్పుడు కంపెనీ ప్రతినిధులు రూ.10 వేలు డిపాజిట్‌ చేస్తే పది కేజీల కరక్కాయలు ఇస్తామని.. లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే వంద కిలోల కరక్కాయలు ఇస్తామని చెప్పారు. వాటిని పొడి చేసి తీసుకొస్తే కిలోకి అదనంగా మరో రూ.50 ఇస్తామని తెలిపారు. దాంతో లక్ష పెట్టుబడి పెడితే 1, 2 రోజుల్లోనే 35,000 లాభం వస్తోందని జనం ఆశపడ్డారు. కొద్ది రోజుల్లోనే డిపాజిటర్ల సంఖ్య భారీగా పెరిగింది. సంస్థ టర్నోవర్‌ కోట్లలోకి చేరింది.

15 రోజులకు ఒకసారి చెల్లింపులు

15 రోజులకు ఒకసారి చెల్లింపులు

కరక్కాయ పొడి తీసుకొచ్చిన ఖాతాదారులకు కంపెనీ ప్రతి 15 రోజులకోసారి చెల్లింపులు చేస్తూ ఉంటుంది. చాలామందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు. వారంతా ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు కావడం విశేషం. కరక్కాయ కంపెనీ అధినేత దేవరాజు అని తెలిసింది. ఇప్పటి వరకు అతన్ని చూడలేదని సిబ్బంది చెప్పడం విశేషం. రూ.40 లక్షలు డిపాజిట్‌ చేసిన బస్వరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కంపెనీలో కంప్యూటర్లు అన్నీ అద్దెకు తీసుకున్నవే కావడం విశేషం.

English summary
big relief for karakkaya Victims. 2018 july scam happen at hyderabad city. company cheated 600 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X