Bigg Boss Telugu:అభిజీత్‌కే ఎక్కువ ఓట్లు.. కానీ విజేతగా వారికే ఎక్కువ అవకాశాలు - సీన్ మారుతోంది

హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్ 4 ఆదివారంతో ముగుస్తుంది. ఆదివారం ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కానుండగా ఇప్పటికే ఈ షో విన్నర్ పై అన్ని సోషల్ మీడియా వేదికలపై చర్చ జరుగుతోంది. శుక్రవారం నుంచి షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ప్రస్తుతం టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను కలుస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే టైటిల్ ఫేవరెట్‌గా ముందువరసలో అభిజీత్ ఉన్నట్లు చాలామంది భావిస్తున్నారు. అయితే అభిజీత్ ఈసారి టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదన్న లీకులు కూడా వస్తున్నాయి. దీంతో మరోసారి బిగ్‌బాస్ చర్చనీయాంశమైంది.

 విజేతగా ఎవరు..?

విజేతగా ఎవరు..?

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ -4 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరువైంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. టైటిల్ రేసులో అభిజీత్, అరియానాలు ముందున్నారు. ఇక అభిజీత్ బిగ్‌బాస్ తెలుగు-4 సీజన్ టైటిల్ ఎగురేసుకుపోతాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు అభిజీత్‌కు అత్యధికంగా ఓట్లు పడ్డాయి కాబట్టి అభిజీత్ ఎగురేసుకుపోతారని అంతా భావిస్తున్న నేపథ్యంలో బిగ్‌బాస్ ఆలోచన మరోలా ఉంది.

 లేడీ కంటెస్టెంట్ వైపు మొగ్గు

లేడీ కంటెస్టెంట్ వైపు మొగ్గు

బిగ్‌బాస్ -4 తెలుగు సీజన్ విన్నర్ అభిజీత్ కాదని సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బిగ్‌బాస్ నిర్వాహకులు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. వచ్చిన ఓట్లు ఆధారంగా కాకుండా ఈ సారి బిగ్‌బాస్ షో నిర్వాహకులు లేడీ కంటెస్టెంటును విజేతగా ప్రకటించాలని డిసైడ్ అయ్యారట. అలా చూస్తే టాప్ ఫైవ్‌లో హారికా, అరియానా గ్లోరీలు ఉన్నారు. మరి వీరిద్దరిలో టైటిల్ ఎవరు ఎగురేసుకుపోతారో అనేదానిపై ఇప్పుడు చూద్దాం.

 అరియానా బిగ్‌బాస్ విన్నర్..?

అరియానా బిగ్‌బాస్ విన్నర్..?

బిగ్‌బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఒకరిని సేవ్ చేసేందుకు ఇతర స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బిగ్‌బాస్ షో నిర్వాహకులు బలిచేశారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. ఓటింగ్‌తో పనిలేకుండా కంటెస్టెంట్లను చాలా సాఫ్ట్‌గా తప్పించేశారు. ఇక గ్రాండ్ ఫినాలేలో కూడా ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయబోతున్నారని సమాచారం. అంటే ఈ సారి కూడా ఓటింగ్‌ ప్రక్రియతో పనిలేకుండా లేడీ కంటెస్టెంట్‌ను విజేతగా ప్రకటించాలని షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటింగ్ ప్రకారం చూస్తే అభిజీత్ ముందంజలో ఉండగా... బిగ్‌బాస్ షో నిర్వాహకుల మనసులో మాత్రం అరియానా గ్లోరీ ఉంది. అంటే ఈ సారి టైటిల్ విజేత అరియానా గ్లోరీ అని సమాచారం.

అయితే మళ్లీ మళ్లీ చెబుతున్నాం... ఇది బిగ్‌బాస్ హౌజ్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. చివరి నిమిషం వరకు విజేత ఎవరనేదానిపై మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఇది కొన్ని విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మాత్రమే అందిస్తోన్న సమాచారం. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చలను కూడా విశ్లేషించి సేకరించి ఇస్తున్న సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+