Bonalu: జులై 7వ తేదీ నుంచి బోనాల పండుగ.. సమీక్ష నిర్వహించిన మంత్రి..!
ఆషాఢమాసం అనగానే గుర్తొచ్చేది బోనాలు. తెలంగాణలో బోనాలు ఘనంగా జరుపుతారు. ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ తర్వాత బోనాల పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బోనాల రోజు సెలవు కూడా ప్రకటిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. బోనాల పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.
2024 జులై 7వ తేదీ నుండి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రి అధికారులతో చర్చించారు. బోనాల పండుగ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయముతో ముందుకు వెళ్తామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను జరుపుతామని పేర్కొన్నారు. బోనాల పండుగ కోసం రూ. 25 కోట్లు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని వివరించారు.

బోనాలు సందర్భంగా ఆర్టీసీ కుడా స్పెషల్ బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. త్వరలోనే బోనాల తేదీ, పూర్తి సమాచారంతో కాలెండర్ ను విడుదల చేయనున్నారు. గొల్కొండ బోనాలతో బోనాల జాతర ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications