నిన్న బయో డైవర్సిటీ..నేడు భరత్‌నగర్: ఫ్లైఓవర్ నుంచి కిందపడ్డ కారు..!
హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి ఓ కారు ఏ రకంగా కిందికి దూసుకెళ్లిందో చూశాం. అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. ఈ సారి భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై నుంచి కిందికి పడింది ఓ కారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతుడిని సోహెల్‌గా గుర్తించారు. బోరబండలోని పండిట్ నెహ్రూనగర్‌కు నివాసిగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మూసాపేట్ వైపు నుంచి సనత్‌నగర్ వస్తుండగా అతి వేగానికి కారు అదుపు తప్పింది. భరత్‌నగర్ ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. అంత పైనుంచి కిందపడటంతో కారు నుజ్జునుజ్జయింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు కింద పడిన సమయంలో సంఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
Recommended Video

-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications