ఉత్తమ డ్రైవింగ్‌కు ప్రశంశలు... సర్టిఫికెట్...! పోలీసుల విన్నూత్న ప్రయోగం..!
ప్రతిరోజు హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల పేరిట జరిమానాలు, నోటీసులు జారీ చేస్తారు..ఇలా రోడ్లపైన ఖాలీ సమయం దొరికితే చాలు ఎదో ఒక వాహానాన్ని ఆపడం వారిపై జరిమానాలు వేయడం లేదంటే కేసులు రాయడం, ఇది రోజు వారిగా పోలీసులు వ్యవహరిస్తున్న తంతు...అయితే ప్రభుత్వంతోపాటు పోలీసులు విధిస్తున్న నిబంధనలు తూచ తప్పకుండా పాటీస్తూ ..ఎలాంటీ ట్రాఫిక్ ఉల్లంఘనలు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ఉత్తములు కూడ ఉన్నారు..సో అలాంటీ ఉత్తముల కోసం ట్రాఫిక్ పోలీసులు ఓ కార్యక్రమాన్ని చేపట్టారు...
ట్రాఫిక్ చాలన్లు లేకుండా, నిబంధనలు పాటించే వారిని గుర్తించి వారికి ప్రశంశలు అందిస్తున్నారు..ఇందుకోసం అలాంటీ వాహానానికి సర్టిఫికెట్ ఆఫ్ సేఫ్ డ్రైవింగ్ స్టిక్కర్‌ను అతికిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు . కాగా ఈ విధానం అబుదాబీ దేశంలో కొనసాగుతుంది..దీంతో హైదరాబాద్‌లో కూడ ఇలాంటీ ప్రంశంశల కార్యక్రమానికి సీపీ మహెశ్ భగవత్ శ్రీకారం చుట్టారు..,చింతల్ కుంట ఎక్స్ రోడ్డులో పలు వాహానాలకు సర్టిఫికెట్ ఆఫ్ సేఫ్ డ్రైవింగ్ స్టిక్కర్‌ను అతికించారు.అనంతరం వారికి సర్టిఫికెట్ ఇచ్చి సన్మానించారు.

కాగా చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఎదుటివారికి ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని ప్రోత్సహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన ఈ సంధర్భంగా పేర్కోన్నారు.ఇలా రోజుకు 24 వాహానల చోప్పున ఆరు నెలల్లో మరో నాలుగువేల వాహనాలు, వచ్చే ఏడాది ఎనిమిది వేల వాహనచోదకులను గుర్తించి సర్టిఫికెట్లతో సత్కరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications