కలెక్టర్ గారూ.. ఏందీ ఇదీ.. జగ్గారెడ్డి సహా నేతల ఫైర్
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతులకు విత్తనాలు ఇవ్వొద్దు అని హుకుం జారీచేసిన వీడియో కలకలం రేపింది. తాను ఎవరూ చెప్పిన వినననే కామెంట్స్ చర్చకు దారితీసింది. దీనిపై అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్ష నేతలు/ ప్రజా ప్రతినిధులు కూడా రియాక్ట్ అవుతున్నారు.
రైతు తన స్వంత నిర్ణయంతో పంటలు వేయకూడదా..? సిద్ధిపేట కలెక్టర్ చెప్పిందే వేయాలా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏ అధికారంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారో చెప్పాలన్నారు. అవగాహనలేని వెంకట్రామిరెడ్డిని కలెక్టర్‌గా ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులకు అండగా ఉంటామని.. సిద్ధిపేట కలెక్టర్ మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

రైతులను ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రైతులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే సిద్ధిపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇటు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సిద్ధిపేట కలెక్టర్ కామెంట్స్ తో ప్రభుత్వ ఆలోచనా విధానం స్పష్టమైందని.. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కరెంట్ విషయంలో జరిగిన కోనుగోళ్లతో ప్రభాకర్ రావు కనిపించకుండా పోయారంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు.
Recommended Video
రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ డీలర్లకు హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశంలో కామెంట్ చేశారు. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయించేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యవసాయశాఖ సమీక్షలో డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన మాట కాదని ఏమైనా చేస్తే.. చర్యలు తప్పవంటూ హెచ్చరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications