హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైడ్స్ లైవ్ టెలికాస్ట్ చేయాలి.. లేదంటే కక్ష సాధింపు చర్యలే: సీపీఐ నారాయణ

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వ తీరును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల గురించి మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేపట్టి అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేసినా, అక్కడ లైవ్ పెట్టాలని కోరారు. సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ద్వారా అందరికీ తెలుస్తుందని అన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వ్యతిరేకించే పార్టీలపై, వ్యాపార సంస్థలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తరచూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోపల ఏం జరుగుతుందో తెలియదని.. దాడులు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి మాట్లాడుకోవాలని అని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో బీజేపీలోకి రావాలని వారిని బెదిరిస్తున్నారని తెలిపారు.

cpi narayana made hot comments on raids

అధికారుల వద్దే కెమెరాలు ఉంటున్నందున సోదాలు లైవ్‌లో చూపించాలని కోరారు. అక్కడే ఏం జరిగిందో లైవ్‌లో ప్రకటించవచ్చని సూచించారు. లైవ్‌లో చూపించకపోతే మాత్రం అది కక్ష సాధింపు చర్యల కిందే భావించాల్సి ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు. బీజేపీ తీరుతో అందరికీ అదే అర్థం అవుతుందని చెప్పారు.

సీపీఐ నారాయణ తరచూ వార్తల్లో ఉంటారు. అన్నీ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయిస్తోన్న ఐటీ దాడుల గురించి కామెంట్ చేశారు. ఇదీ ముమ్మాటికీ కక్షసాధింపు చర్యే అవుతుందని తెలిపారు.

English summary
cpi narayana made hot comments on it, ed, cbi raids. bjp government has hatred on rivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X