ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు హెల్మెట్ పెట్టేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్! నెంబర్ ప్లేట్?

హైదరాబాద్: వాహనదారులు, పౌరులకు ట్రాఫిక్ నిబంధనలను తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్, సీటు బెల్ట్ లేని ప్రయాణం ప్రాణానికి ప్రమాదమంటూ అవగాహన కల్పిస్తూనే హెచ్చరికలు చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ వాడేశారు..


నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నవారి, ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రమాదానికి గురికావొద్దంటూ సున్నితంగా హెచ్చరిస్తున్నారు. అంతేగాక, తాజా ఘటనలకు సంబంధించిన ఫొటోలతో వాహనదాలకు అవగాహన కల్పిస్తున్నారు. పలు పోస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉండటం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ నటులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించిన తాజా పోస్టర్‌ను కూడా సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వాడుకున్నారు.

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు హెల్మెట్ పెట్టేసి పర్ఫెక్ట్ అంటూ..

బైక్‌పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి వెళ్తున్న పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఈ పోస్టర్‌లో వీరిద్దరూ కూడా హెల్మెట్ ధరించలేదు. దీంతో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు హెల్మెట్ జోడించి.. ఆ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'ఇప్పుడు సరిగ్గా ఉంది. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండిండి' అనే క్యాప్షన్ ఇచ్చారు.

ఎన్టీఆర్, రామ్‌చరణ్ బైక్‌కు నెంబర్ ప్లేట్ దించేసిన ఫ్యాన్స్

కాగా, దీనికి ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. ఇప్పటికీ పర్‌ఫెక్ట్ కాలేదు. నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల బై‌క్‌కు నెంబర్ ప్లేట్ కూడా తయారు చేసి పెట్టేశారు అభిమానులు. 'ఎస్ఎస్ఆర్(ఎస్ఎస్ రాజమౌళి) 13 ఆర్ఆర్ఆర్ 2021' అనే నెంబర్ ప్లేట్‌ పెట్టారు. దీంతో అభిమానులు లైకులు, షేర్లు చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయిందని, రెండు మూడు నెలల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+