Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Disha case encounter :ఆ పోలీసులపై హత్యానేరం కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యాలన్న ఏపీ మానవ హక్కుల ఫోరం

షాద్ నగర్ లో దారుణ హత్యకు గురైన దిశ కేసు కొత్త మలుపు తిరిగింది. ఊహించని విధంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హత్యచేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సంఘటన స్థలంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను తీసుకువెళ్లిన పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ నలుగురు మానవ మృగాలు. దీంతో వారిని పోలీసులు దిశను దహనం చేసిన చోటే ఎన్కౌంటర్ చేశారు. ఇక దీని పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తాము వచ్చి పరిశీలించే వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది . ఇక ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాల నుండి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని, నేరస్థులని నిర్ధారణ కాకముందే నిందితులను పోలీసులు హతమార్చారని పలువురు మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే సమయంలో ఏపి మానవ హక్కుల ఫోరం'దిశ' కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీస్ సిబ్బందిపై హత్యానేరం కింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

Disha case encounter : Murder cases were filed against the police : AP Human Rights Forum

చనిపోయింది రిమాండ్ ఖైదీలే కాబట్టి న్యాయస్థానం ఈ కేసును సుమోటోగా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కావాలని నిందితులను ఓ పథకం ప్రకారం ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. నిందితులు నేరం చేశారని నిర్ధారించి శిక్షలు వేయాల్సింది న్యాయస్థానమని, పోలీసులు కాదని మానవ హక్కుల ఫోరం వ్యాఖ్యానించింది. చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవడం తప్పని ఏపీ మానవహక్కుల ఫోరం ఆక్షేపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు చూడాల్సిన అవసరం ఉందని ఏపీ మానవ హక్కుల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.

Recommended Video

    CP Sajjanar Press Meet || ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+