ప్రగతి భవన్ లో కుక్క మరణం .. డాక్టర్ పై కేసు నమోదు
సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మరణిస్తే డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని కేసు నమోదు చేశారు సదరు కుక్కలను చూసుకునే ఆలీ ఖాన్ . సీఎం కేసీఆర్ నివాసంలో ఇటీవల హస్కీ అనే ఓ పెంపుడు కుక్క మృతిచెందింది. ఆ కుక్క మరణం డాక్టర్ కు తిప్పలు తెచ్చి పెట్టింది .
బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్ అలీఖాన్ ఐదేళ్లుగా ప్రగతి భవన్ డాగ్ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొత్తం 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన 11నెలల హస్కీ అనే పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రగతి భవన్ డాగ్స్ హ్యాండ్లర్ ఆసిఫ్ అలీఖాన్ రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వటంతో ఆ వైద్యుడు వచ్చి హస్కీకి చికిత్స అందించాడు.

తీవ్రంగా జ్వరం ఉండటంతో లివర్ టానిక్ ఇచ్చినట్టు సమాచారం . ఆ తరువాత హస్కీ పరిస్ధితి మరింత విషమించటంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లో యానిమల్ కేర్ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే డాక్టర్ చికిత్స చేస్తుండగానే హస్కీ మరణించింది. దీంతో డాగ్స్ హ్యాండ్లర్ ఆలీఖాన్.. యానిమల్ కేర్ క్లినిక్ వైద్యుడైన రంజిత్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే కుక్క మృతిచెందిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఇంట్లో కుక్క చావు ఆ వైద్యుడికి ఇబ్బందులు తెచ్చి పెట్టింది .
Recommended Video
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications