హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక డ్రగ్స్ డ్రైవ్.. నిమిషాల్లోనే రిపోర్ట్.. బ్లడ్, యూరిన్ కూడా పరీక్ష

|
Google Oneindia TeluguNews

డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా.. గంజాయి గుప్పుమన్న క్షణాల్లో వాలుతున్నారు. దీంతోపాటు డ్రగ్స్ తీసుకునే వాళ్ల ఆట కట్టించేందుకు కొత్త టెక్నాలజీ వినియోగించున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో ఇక డ్రగ్‌ టెస్టులు చేస్తారట. డ్రగ్ ఎనలైజర్లను వాడతారు. డ్రగ్ అనలైజర్ ద్వారా నోటిలోని లాలాజలంతో టెస్ట్ చేస్తారు. 2 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్‌లో పాజిటివ్‌ వస్తే వెంటే మూత్రం, రక్త నమూనాలు సేకరించి.. వాటిని పరీక్షిస్తారు. ఆ పరీక్షలతో డ్రగ్స్ తీసుకున్నది లేనిదీ నిర్ధారణ చేస్తారు.

drug test to conduct drug analyzer

డ్రగ్ ఎనలైజర్లను కొనుగోలు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. వీటి ద్వారా ఉమ్ము, మూత్రం శాంపిళ్లను సేకరించి నిమిషాల్లో డ్రగ్ టెస్ట్ చేసి గుర్తిస్తారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లాగే డ్రగ్స్ కట్టడి చేసేందుకు ముఖ్య ప్రాంతాల్లో డ్రగ్ టెస్టులు చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి టెస్టులు కేరళ, గుజరాత్‌ పోలీసులు వినియోగిస్తున్నారు. డ్రగ్‌ టెస్టుల నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు కూడా కసరత్తు చేస్తున్నారు. డ్రగ్‌ అనలైజర్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను పోలీసులు అధ్యయనం చేయనున్నారు. డ్రగ్‌ తీసుకుంటే ఎరుపు రంగులో లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు కనిపిస్తాయి.

పరీక్షలో పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి మూత్రం నమూనాలు తీసుకుంటారు. అలాగే రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ డ్రగ్ అనలైజర్ల ద్వారా గంజాయి, హష్‌ ఆయిల్, కొకైన్, హెరాయిన్‌ తీసుకున్న వారిని ఇట్టే గుర్తించవచ్చని పోలీసులు తెలిపారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ డ్రగ్‌ పరీక్షలు చేస్తారు. విదేశాలతో పాటు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్న డ్రగ్ హంటర్ ఎనలైజర్లను కొనుగోలు చేసేందుకు పోలీసులు ఆసక్తి చూపుతున్నారు. ఆ డిజిటల్ డివైజ్‌ పనితీరు గురించి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆమోదంతో డ్రగ్‌ ఎనలైజర్లను కొనుగోలు చేసి, ముందుగా ట్రయల్‌ రన్‌ చేస్తారు. తర్వాత సిబ్బందికి ట్రైనింగ్‌ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వాడే అవకాశం ఉంది.

English summary
drug test to conduct analyzer hyderbad police said. within 2 minutes report are came.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X