Fire Accident: నాచారంలో అగ్నిప్రమాదం.. పలువురు కార్మికులకు అస్వస్థత..

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. తాజాగా మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమ లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో విషవాయువులు కూడా బయటకు రావడంతో కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అస్వస్థతకు గురైన కార్మికులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అమోనియో విష వాయువు పీల్చుకుని పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఈ ప్రమాదం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏకశిలా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాచారంలోనే వారం రోజుల్లో అగ్నిప్రమాదం జరగడంపై ఇది రెండో రోజు.

Fire Accident at nacharam ekashila chemical company

ఏప్రిల్ 12 జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. కంపెనీ చుట్టుపక్కల పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటన ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. ఈ మధ్యే సికింద్రాబాద్ స్వప్నలోక్ కంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఏడు, ఎనిమిది అంతస్థుల్లో ఈ మంటలు చెలరేగాయి. ఐదో ఫ్లోర్ లో ఉన్న ఐదుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివ అనే మరో వ్యక్తి మృతి చెందారు.

అంతకు ముందు కూడా ఓ స్పోర్ట్స్ షో రూమ్ లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంతో బిల్డింగ్ మొత్తం దెబ్బతినడంతో దాన్ని కూల్చేశారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దుకాణ యజమానులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+