హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన: రేపటి వరకు, బయటికి రావొద్దంటూ అలర్ట్
హైదరాబాద్: గత రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే వరద బురదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదుల సంఖ్యలో మనుషులు, వందల సంఖ్యలో పశువులు భారీ వర్షాలు, వరదల కారణంగా మృత్యువాతపడ్డాయి. అయితే, రెండు రోజులు తెరిపినిచ్చిన వర్షాలు.. మళ్లీ సోమవారం నుంచి కురుస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం దంచికొట్టింది. సుమారు గంటపాటు కురిసిన వర్షంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం పడే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలకు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని చెబుతున్నారు.

సోమవారం సాయంత్రం నుంచి నగరంలోని కూకట్‌పల్లి, అల్విన్ కాలనీ, సికింద్రాబాద్, హైదర్ నగర్, బోయినపల్లి, మారేడ్ పల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, బోరబండ, తదిర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
కోఠి, అబిడ్స్, బేగంబజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, దోమలగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, లక్డీకపూల్, పాతబస్తీ, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్‌లోని తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కార్యాలయాలు, విద్యాలయాల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొనసాగుతున్న వర్షాలపై హైదరాబాద్ వాసులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దంటూ అధికారులు సూచించారు. రేపు ఉదయం వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667
మరోవైపు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications