వద్దంటే వాన.. సిటీలో భారీ వర్షం, జనం ఇబ్బందులు

హైదరాబాద్ నగరాన్ని వాన వదలడం లేదు. రోజు ఏదో ఒక సమయంలో వరుణ దేవుడు కురుస్తూనే ఉన్నాడు. గత రెండు మూడు రోజుల నుంచి చలి వాతావరణం నెలకొంది. వర్షకాలం పూర్తవుతున్నా.. వాన మాత్రం వదలడం లేదు. తేలికపాటి జల్లులకే చిత్తడి అయ్యే హైదరాబాద్ రహదారులు.. బురదమయంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో వద్దంటే వర్షం కురుస్తోంది. శనివారం నగరంలో పలు చోట్ల వాన దంచికొట్టింది. సాయంత్రం నగర వ్యాప్తంగా రెండు గంటలు వర్షం పడింది. కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, కోటి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 heavy rain lat hyderabad city

నగరంలో పలు చోట్ల ట్రాపిక్ జామ్ అయ్యింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికతో నగరవాసులు మరింత ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ కు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురుస్తుందని అలర్ట్ చేసింది. సిటీతో పాటు మెదక్, వికారాబాద్, సిద్దిపేట్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+