హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో వాన.. జిల్లాల్లో భారీ వర్షం

|
Google Oneindia TeluguNews

పశ్చిమ, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తు‌న్నా‌యి. పలు జిల్లాల్లో ఆది‌వారం భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.

సిటీతోపాటు జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, మంచి‌ర్యాల, ములుగు, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, ఆది‌లా‌బాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురు‌స్తా‌యి. సంగా‌రెడ్డి, పెద్దపల్లి, హన్మమ‌కొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌ జిల్లాల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. పలు‌చోట్ల ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌ గా‌లు‌లతో కూడిన వర్షాలు పడే అవ‌కాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

heavy rainfall at hyderabad as well as districts.

హైదరాబాద్‌లో శనివారం రాత్రి నుంచే వాతావరణం మారింది. రాత్రి వర్షం కురిసింది. రాత్రి నుంచి చిరుజల్లులు కురిశాయి. ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షం పడటంతో రైతన్న పొలం పనిలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టుల్లోకి వరదనీరు క్రమంగా వస్తోంది.

ఈ సారి వర్షాలు కాస్త ఆలస్యంగా పడుతున్నాయి. దీంతో పొలం పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడు రైతులు బిజీగా ఉన్నారు. పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో పంట కూడా ఆలస్యంగా రానుంది. యాసంగి పంట వేయడం కూడా లేట్ అవుతుంది.

English summary
heavy rainfall at hyderabad as well as districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X