అలర్ట్ అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షం కురిసే ఛాన్స్, వాతావరణ శాఖ
గత రెండు, మూడు రోజుల నుంచి వర్ష ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది.
గత రెండు, మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి రాజంపేట మండలం లింగాయపల్లిలో మండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజంపేట నుంచి కామారెడ్డికి రాకపోకలకు నిలిచిపోయాయి.

సోమవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. శుక్రవారం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రదేశంలో కొనసాగుతుందని వెల్లడించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఈ జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications