హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్మెట్ మహిమ .. నెత్తిమీద పిడిగు పడినా బతికాడు

|
Google Oneindia TeluguNews

హెల్మెట్ ధరించండి .. ప్రాణాలు కాపాడుకోండి అని ఎవరు ఎంత చెప్పినా ఎవరికీ పెద్దగా రుచించిన దాఖలాలు లేవు . ఇక పోలీస్ శాఖ పదేపదే ఊదరగొట్టినా , వీడియోలు, ఆడియోలతో ప్రచారం చేసినా ఫలితం మాత్రం పెద్దగా కనిపించలేదు. ఇక హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తామని చెప్పినా నేటికీ ఫైన్ లు చెల్లిస్తున్నవారే అధికం . ఈ వార్త చదివితే మాత్రం హెల్మెట్ గురించి ఏమి చెప్పకుండానే వెళ్లి హెల్మెట్ పెట్టుకునే ప్రయాణం ప్రారంభిస్తారు. అసలు కథ ఏమిటి అంటే

అమ్మాయి వేషం... సాఫ్ట్ వేర్ బ్రహ్మీలే టార్గెట్... <br>అమ్మాయి వేషం... సాఫ్ట్ వేర్ బ్రహ్మీలే టార్గెట్...

హెల్మెట్ పెట్టుకోండి..ప్రాణాల్ని కాపాడుకోండి అని పోలీస్ శాఖ ప్రజల చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్తుంది. హెల్మెట్ వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బైటపడ్డవారు ఎంతోమంది ఉన్నారు. కానీ తాజాగా ఓ వ్యక్తిని పిడుగుపాటు నుండి కాపాడింది హెల్మెట్ . హెల్మెట్ ఇప్పట వరకు రోడ్డు ప్రమాదాల నుండే కాదు పిడుగుపాటు నుంచి కూడా కాపాడి హెల్మెట్ తన మహిమను నిరూపించుకుంది. శిరస్త్రాణం తలమీద పెట్టుకోండి చాలు . మిమ్మల్ని కాపాడుకుంటా అంటూ హెల్మెట్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

Helmet saved a mans life from a thunderbolt

హెల్మెట్ వల్ల ప్రాణాపాయం నుండి ఒక వ్యక్తి బయటపడిన సంఘటన బుధవారం (మార్చి 20)న మెదక్‌ శివారులో చోటుచేసుకుంది. వెల్దుర్తి మండల రామాయిపల్లికి చెందిన నర్సింహులు శివ్వాయిపల్లి నుంచి బైక్‌పై మెదక్‌ వస్తున్నాడు.ఈ సమయంలో దారిలో వర్షం కురవటంతో బంగ్లా చెరువు కట్టపై ఉన్న మర్రిచెట్టు కింద నర్శింహులు ఆగాడు . ఈ సమయంలోనే హఠాత్తుగా వర్షంతోపాటు ఉరుములు, మెరుపులతో పాటు నర్శింహులుపై పిడుగు పడింది.ఆ పిడుగు ధాటి నుంచి నర్సింహులుకు గాయాలయ్యాయి. కానీ కానీ అతని తలపై హెల్మెట్‌ ఉండటంతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడు. ఈ విషయం తెలిసిన వాళ్ళు హెల్మెట్ ప్రాణాలను కాపాడింది అని గొప్ప గా చెప్పుకోవటమే కాదు. హెల్మెట్ పెట్టుకోవాలని కొందరు నిర్ణయం సైతం తీసుకున్నారట .

English summary
Helmet saved a man's life form a thunderbolt at medak outskirts . a man named narsimhulu travelling on a bike from raamaayapalli and suddenly the rain started . he went under a tree and a thunderbolt attacked him but the helmet saved his life from the thunderbolt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X