సడెన్ హార్ట్ఎటాక్: కాలేజీలోనే కుప్పకూలిన ఇంజినీరింగ్ విద్యార్థి (వీడియో)
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఓ విద్యార్థి సడెన్ హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయాడు.
హైదరాబాద్: ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మరణాలు యువకుల్లోనే ఎక్కువగా సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఓ విద్యార్థి సడెన్ హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయాడు.
ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్ అనే విద్యార్థి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విశాల్ స్వస్థలం రాజస్థాన్ అని తెలిసింది. కాగా, గుండెపోటుతో మరణిస్తున్నవారిలో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Its so Sad, a Btech 1st year #student of CMR Engineering College died, reportedly of #cardiacarrest, suddenly collapsed while walking in the building, in #Medchal, outskirts of #Hyderabad, #Students and official immediately shifted him to hospital, but... 😢#heartattack #CPR pic.twitter.com/Fztq4pYMfq
— Surya Reddy (@jsuryareddy) March 3, 2023
ఇటీవల ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ములో కసరత్తులు చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. మరో ఘటనలో నిర్మల్‌లో పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న 20 ఏళ్ల యువకుడు అలాగే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే గుండెపోటుకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications