లాక్ డౌన్ అమలుపై పలు ఏరియాల్లో హైదరాబాద్ సీపీ సడన్ విజిట్ .. ఏం చెప్పారంటే
కరోనా వైరస్ .. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ విధించారు . ఇక ఈ లాక్ డౌన్ గ్రామీణ ప్రాంతాల్లోనే కచ్చితంగా అమలు జరుగుతుందని , పట్టణాలు , నగరాల్లో చదువుకున్న వాళ్ళే లాక్ డౌన్ పాటించటం లేదని తెలంగాణా పోలీసుల సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అమలు ఎలా కొనసాగుతుంది అని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ పలు ప్రాంతాల్లో సడన్ విజిట్ చేశారు .
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలును పరిశీలించేందుకు పోలీస్‌కమిషనర్ అంజనీకుమార్ పలు ఏరియాల్లో పర్యటించారు. ముఖ్యంగా ఆయన వెస్ట్‌జోన్ పరిధిలోని ఆసిఫ్‌నగర్ , హుమాయూన్‌నగర్ , మాసబ్‌ట్యాంక్ , బంజారాహిల్స్ , పంజాగుట్ట ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను క్షేత్ర స్థాయిలో గమనించారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు .

కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ సరిగా పాటించటం లేదని గుర్తించిన హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో జనాలు అనవసరంగా రోడ్లమీదకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇక అలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు . అలాంటి వారిపై కఠినచర్యలు తప్పవని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేసినప్పుడే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందని సీపీ అంజనీ కుమార్ అభిప్రాయపడ్డారు . సోషల్ డిస్టెన్స్‌పై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటేనే తమను తాము కరోనా బారి నుండి కాపాడుకుంటారని ఆయన వెల్లడించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications