హైదరాబాద్: వరదనీటిలో కొట్టుకుపోయిన నవీన్ మృతదేహం సరూర్‌నగర్ చెరువులో లభ్యం
హైదరాబాద్: నగరంలోని సరూర్‌నగర్ సమీపంలో ఆదివారం సాయంత్రం వరదనీటిలో పడి కొట్టుకుపోయిన నవీన్(45) మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. సుమారు 20 గంటలపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సరూర్‌నగర్ చెరువులో గాలించగా.. ఘటన జరిగిన వంద మీటర్ల దూరంలో అతని మృతదేహం లభ్యమైంది.
నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం తపోవన్ కాలనీ వద్ద ప్రమాదవశాత్తూ వరదలో పడి నవీన్ కొట్టుకుపోయాడు. స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టారు. నవీన్ ఆచూకీ లభించకపోవడంతో తిరిగి సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టగా.. అతని మృతదేహం లభించింది.
కాగా, ఇటీవల నేరెడ్‌మెట్‌లో కూడా సుమేధ అనే బాలిక తన సైకిల్‌తో వరదలో కొట్టుకుపోయింది. ఆమె మృతదేహం సమీపంలోని చెరువులో లభ్యమైంది. ఈ రెండు ఘటనలతో అధికారులపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఇలాంటి విషాద ఘటనలో చోటు చేసుకుంటున్నాయని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ నాలాల ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి.. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ నాలాలపై కప్పులు వేసి మూసివేయాలని ఆదేశించారు.
రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్ నిర్మాణం చేస్తామని, అదే రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న నాలాలకు సంబంధించి సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications