Hyderabad: మరో ఘనత సాధించిన హైదరాబాద్.. ప్రపంచ సంపన్న నగరాల్లో చోటు..
హైదరాబాద్ :ఎంతో మందిని అక్కున చేర్చుకుంటున్న మహానగరం. ఈ పట్నంలో బీదవాడు నుంచి బిలియనీర్ వరకు ఉన్నారు. భాగ్యనగరం భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు నిలయం. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచస్తాయి కంపెనీలు భాగ్యనగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా పట్నంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది.
అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నారని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదిక పేర్కొంది. 2012 నుంచి 2022 వరకు హైదరాబాద్‌లో మిలియనీర్లు 78 శాతం పెరిగిందని వివరించింది. ప్రపంచ అత్యంత సంపన్న నగరాల్లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ మొదటి స్థానంలో ఉంది. న్యూయార్క్ లో 3,40,000 మంది మిలియనీర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సంపన్న నగరాల్లో మొత్తం 97 నగరాలు స్థానం దక్కించుకున్నాయి. జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యో సంపన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది.

12,100 మంది మిలియనీర్లతో కలకత్తా 63 స్థానం దక్కించుకోగా.. హైదరాబాద్ 65 స్థానంలో నిలిచింది. అయితే భారత వాణిజ్య రాజధాని ముంబైకి చోటు దక్కకపోవడం గమనార్హం. ఆఫ్రికా, ఆస్ట్రేలియాసియా, సీఐఎస్, తూర్పు ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా ఇలా వివిధ ప్రాంతాలుగా విభజించి హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంపన్న నగరాల జాబితాను తయారు చేసింది.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications