మెట్రో బంపర్ ఆఫర్.. ఆ కార్డుతో రోజు తిరగొచ్చు.. కానీ ఆ రోజులే, కార్డుకు ఎంతంటే
మెట్రో.. వేగంగా, క్షేమంగా గమ్యం చేరొచ్చు. కానీ మెట్రో గురించి నెగిటివ్ అంటే ఒక్కటే ఉంది. అదే టికెట్ ధర గురించి ఇబ్బంది ఉంది. వేగంగా గమ్య స్థానం చేరొచ్చు.. కానీ.. మరీ ఇంత టికెట్ అని మధ్యతరగతి వారు అనుకునేవారు. అయితే మెట్రో ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో.. సెలవు రోజుల్లో పాస్ ఇస్తోంది. దీంతో ఎక్కడినుంచి ఎక్కడికి అయినా.. ఎన్నిసార్లు అయినా వెళ్లే వీలు ఉంటుంది. ఇప్పుడు కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో జనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అన్‌లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్
అన్‌లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్ హైదరాబాద్ మెట్రో రైల్ తీసుకొచ్చింది. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారాలు, పబ్లిక్ హాలీడేస్ సమయంలో ఈ ఆఫర్ సూపర్ బెనిఫిట్స్ అందించనుంది. సమ్మర్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సహాయంతో సెలవు రోజుల్లో రూ. 59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చు. హైదరాబాద్ మెట్రో రైల్లో సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు.

రోజంతా తిరిగొచ్చు..
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని సూచించారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ సూపర్ సేవర్ కార్డు ఉపయోగపడుతుంది. సో.. ఆ సెలవు ఎప్పుడూ వస్తాయి.. కార్డు ఎప్పుడూ వాడదాం అనుకునే వారు వెయిట్ చేయండి. శనివారం ఉగాది పర్వదినం ఉంది. వీకెండ్ కూడా కావడంతో పనిచేసే అవకాశం ఉంది.

సిటీకి వచ్చేవారు కూడా
మెట్రో అంటేనే వేగంగా గమ్యస్థానం చేరడం. ఈ ఆఫర్‌తో రష్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. సమ్మర్ హాలీడేస్ వస్తున్నాయి. సో సిటీకి వచ్చేవారు కూడా కార్డు తీసుకొని యూజ్ చేసుకునే ఆస్కారం ఉంది. అవును.. వారంతా పర్యాటక ప్రాంతాల తిరిగే సమయంలో మెట్రో యూజ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ తక్కువగానే ఉపయోగం ఉంటుంది. కానీ షాపింగ్ చేస్తే మాత్రం కార్డుకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో.. జనం రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆఫర్‌తో కిక్కిరిసిపోయే చాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications