Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో స్వయంగా రంగంలోకి దిగిన స్టీఫెన్ రవీంద్ర..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇవ్వాళ భారీ వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం ముంచెత్తింది. గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలన్నీ స్తంభించిపోయాయి. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనానికి గురయ్యాయి.

వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Hyderabad rain: Cyberabad CP Stephen Ravindra clears the traffic after heavy jam

భారీ వర్షం ధాటికి ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాయంత్రం వేళ.. తమ కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేని దుస్థితిని ఎదుర్కొన్నారు. ఫ్లైఓవర్లన్నీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయాయి.

ఐటీ కారిడార్ కొండాపూర్, గచ్చీబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి..వంటి ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు మందగించాయి. అటు సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కుత్బుల్లాపూర్, బోయినపల్లి, బేగంపేట్‌లల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.

వర్షం కారణంగా హైదరాబాద్ నుంచి వెలుపలికి వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. విజయవాడ, కర్నూలు, నిజామాబాద్ మార్గాల్లో ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్‌కు దారి తీసే రహదారుల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

గంటల కొద్దీ వాహనాలు స్తంభించిన నేపథ్యంలో- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగారు. ఆకస్మికంగా కురిసిన భారీవర్షంతో రోడ్లు జలమయమైన ప్రాంతాల్లో కలియతిరిగారు. వాహనదారులు, ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+