Hyderabad:దిగువ మధ్యతరగతి సగటు నెలవారీ ఆదాయంలో హైదరాబాద్ టాప్..
దిగువ మధ్యతరగతి సగటు నెలవారీ ఆదాయంలో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో దిగువ మధ్యతరగతి వ్యక్తుల సగటు నెలవారీ ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 4.7 శాతం పెరిగింది. హోమ్ క్రెడిట్, కన్స్యూమర్ ఫైనాన్స్ ప్రొవైడర్ వారి "ది గ్రేట్ ఇండియన్ వాలెట్" అధ్యయనం ప్రకారం పూణే జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దిగువ మధ్యతరగతి నివాసితుల సగటు నెలవారీ ఆదాయం రూ.44,000 కాగా, పూణేలో రూ.39,000.
హైదరాబాద్ లో 2023లో దిగువ మధ్యతరగతి సగటు ఆదాయం రూ.42 వేలు ఉండగా.. 2024లో 44 వేలకు చేరింది. పూణేలో 2023లో రూ.35 వేలు ఉండగా 2024లో రూ.39 వేలుగా ఉంది. బెంగళూరు 2023లో రూ.35 వేలు, 2024లో రూ.38 వేలు, డెహ్రాడూన్ 2023 రూ. 31 వేలు, 2024లో రూ.37 వేలు, జైపూర్ 2023లో రూ.31 వేలుగా ఉండగా 2023లో రూ.34 వేలుగా ఉంది. ముంబై 2023లో రూ.32 వేలు ఉండగా.. 2024 రూ.33 వేలుగా ఉంది. అహ్మదాబాద్ లో రూ.32 వేలు ఉండగా.. 2024లో రూ.33 వేలుగా ఉంది.

చెన్నైలో 2023లో రూ. 29 వేలు ఉండగా.. 2024లో రూ.32 వేలుగా ఉంది. కోల్‌కతాలో 2023లో రూ. 29 వేలు ఉండగా.. 2024లో రూ.32 వేలుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ లో 2023లో రూ.30 ఉండగా 2024లో రూ.32 వేలకు పెరిగింది. పాట్నాలో 2023లో రూ.29 వేలు ఉండగా.. 2024లో రూ.31 వేలకు చేరింది. భోపాల్ లో రూ.28 ఉంగా 2024లో రూ.30 వేలుగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చండీగఢ్,లూధియానా,రాంచీ,లక్నో, కొచ్చి ఉన్నాయి.
స్థిర నెలవారీ ఖర్చుల వారీగా భారతీయ నగరాల జాబితా కూడా అగ్రస్థానంలో ఉంది. 2024కు సంబంధించి హైదరాబాద్ స్థిర నెలవారీ ఖర్చు రూ. 24 వేలుగా ఉంది. పూణేలో రూ.21 వేలు, బెంగళూరు రూ.22 వేలు, డెహ్రాడూన్ రూ.21 వేలు, జైపూర్ రూ.20 వేలు, ముంబై రూ.20 వేలు, అహ్మదాబాద్ రూ.18 వేలు, చెన్నై రూ.14 వేలుగా ఉంది.కోల్‌కతా రూ.19 వేలు ఉండగా.. ఢిల్లీ ఎన్సీఆర్ లో రూ.19 వేలు, పాట్నా రూ.19 వేలు, భోపాల్ రూ.18 వేలు, చండీగఢ్ రూ.19 వేలు, లూధియానాలో రూ.17 వేలుగా ఉంది. స్థిర ఖర్చులలో నెలవారీ బడ్జెట్‌లో 50 శాతం ఆహారం, బసకు వెళుతుందని నివేదిక పేర్కొంది












Click it and Unblock the Notifications