Guess this bus stop name ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. రియాక్షన్
తెలంగాణ ఆర్టీసీ పలు కీలక మార్పులు జరిగాయి. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఛేంజెస్ ఉన్నాయి. సోషల్ మీడియాలో సజ్జనార్ యాక్టివ్‌గా ఉంటున్నారు. సమస్యలను ప్రస్తావించాలని కోరగా.. పలువురు స్పందించారు. అలా పలు ఇష్యూస్ ముందుకు వచ్చాయి కూడా.. ఇవాళ, మరో ట్వీట్ చేశారు సజ్జనార్. ఆ ట్వీట్‌కు చాలా మందే స్పందిస్తున్నారు.
OLEANG అని రాసి..
బస్.. దానిపై బస్ స్టాప్ అని ఫోటో ఉంది. ఇంగ్లీష్ పదాలు అటు, ఇటుగా ఉన్నాయి. ఈ బస్టాప్ పేరు ఏంటో చెప్పాలని సజ్జనార్ కోరారు. దీనికి నెటిజన్లు చాలా మంది రియాక్ట్ అవతుతున్నారు. బస్సు మీద OLEANG అని రాసి ఉంది. అంటే ఏంటీ అని సజ్జనార్ అడుగుతున్నారు. దానికి చాలా మందే రెస్పాండ్ అవుతున్నారు. ఇదీ అంటూ తెగ ట్వీట్స్ చేస్తున్నారు.

నాగోల్
అవును అదీ నాగోల్ అని మెజార్టీ పీపుల్ స్పందించారు. ఆ పదాలు స్పెల్లింగ్‌కు సరిపోతున్నాయి. నాగోల్ అని రాసి ఉంది. మరొకరు జేబీఎస్, సీబీఎస్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారు సరిగా అర్థం చేసుకొని ఉండరు. తార్కికంగా ఆలోచించి ఉండరు. ఆ ట్వీట్‌కు సజ్జనార్ రీ ట్వీట్ చేయాల్సి ఉంది. అదీ నిజంగా నాగోల్.. మరీ ఇంకేమైనా ఉందా అనే సందేహాం కలుగుతుంది.

ధరల వాత
సజ్జనార్ ఇంతకుముందు కూడా పలు ట్వీట్లు చేశారు. సమస్యలపై వేగంగా స్పందించారు. జర్నలిస్టుల పాస్‌కు సంబంధించి ఆన్ లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.. కానీ ధరల వాత ఒక్కటే ఇబ్బంది కలిగిస్తోంది. డీజిల్ ధరలు పెరగడంతో రేట్ హైక్ తప్పడం లేదు. అందుకే ఆర్టీసీ ఛార్జీల వడ్డన జరుగుతుంది. ఇదీ ప్రయాణికులకు పెను భారంగా మారుతుంది. ఇప్పట్లో ఎన్నికలు లేనందున కేసీఆర్ సర్కార్ ధరలు పెంచుకుంటూ పోతుంది. లేదంటే పెంచే ధైర్యం చేయకపోయి ఉండేది. దీనిపై విపక్షాలు ఆందోళనలు చేస్తోన్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.












Click it and Unblock the Notifications