Hyderabad: పగలు వేడి.. రాత్రి చలి.. రానున్న రోజుల్లో నగరంలో పరిస్థితి..
దేశంలో నైరుతి రుతుపవనాలు సీజన్ ముగిసింది. ఇక రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ వెచ్చని పగలు వేడిగా.. రాత్రులు చల్లగా ఉంటుందని పేర్కొంది. రాబోయే 10 రోజుల వాతావరణం ఫిబ్రవరి చివరి నుంచి మార్చి ప్రారంభంలో ఎలా ఉంటుందో అలా ఉండనుందట. పగటిపూట చాలా ఎక్కువ వేడిగా ఉండి.. తేమ ఉంటుందట.
రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నందున రాత్రులు చల్లగా ఉంటాయని, అయితే పగటి ఉష్ణోగ్రత 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. వర్షాకాలంలో హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 615.4 మిల్లీమీటర్లు దాటి 769.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరం మొత్తం మీద 'అదనపు' వర్షపాతం నమోదైతే, కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లోని షేక్‌పేట, మారేడ్‌పల్లి, చార్మినార్, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి మండలాల్లో నగర సగటు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో 'సాధారణ' వర్షపాతం నమోదైంది. అయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో సాధారణ వర్షపాతం 738.6 మిల్లీమీటర్ల కాగా 861.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, మారేడ్‌పల్లిలో నిన్న 35.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల దిగువకు పడిపోయింది.












Click it and Unblock the Notifications