Murali Mohan: హైడ్రా నోటీసులపై స్పందించిన జయభేరి.. తామే కూల్చుకుంటామన్న మురళీ మోహన్

హైడ్రా జారీ చేసిన నోటీసులపై ప్రముఖ నటుడు, నిర్మాత, జయభేరి నిర్మాణ సంస్థ అధినేత మురళీ మోహన్ స్పందించారు. గత 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని మురళి మోహన్ చెప్పారు. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని తెలపారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉందని.. వాటికే అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. రేకుల షెడ్ కూల్చివేతకు హైడ్రా రావాల్సిన అవసరం లేదన్నారు.

తామే షెడ్ ను కూల్చేస్తామని మురళీ మోహన్ స్పష్టం చేశారు. శనివారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మురళీ మోహన్ స్పందించారు. హైడ్రా ఇప్పటికే చాలా అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. చెరువు బఫర్, ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చి వేయాలని పేర్కొంది.

Jayabheri chief Murali Mohan responded to the Hydra notices

అలాగే దుర్గం చెరువు బఫర్, ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైడ్రా అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా ముందుకెళ్తోంది. తుమ్మడి కుంట చెరువు అక్రమించిన నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను కొద్ది రోజుల క్రితం కూల్చివేసింది. ఈ కన్వెన్షన్ సినీ నటుడు నాగార్జునకు చెందినది. ఆదివారం కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించింది.

బాచుపల్లి బౌరంపేట చెరువు, దుండిగల్ కత్వా చెరువు, మాదాపూర్ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలు, విల్లాలను హైడ్రా కూల్చివేస్తోంది. అయితే బాధితులు తాము బ్యాంక్ లోన్ తీసుకుని ఇళ్లు కట్టుకున్నామని చెబుతున్నారు. అయితే ఎవరైనా అపార్ట్ మెంట్ లేదా భూమి కొనుగోలు చేసే ముందు వాటికి అన్ని అనుమతులు ఉన్నాయా.. బరఫర్ జోన్ ఉందా లేదా ఎఫ్ట్ఎల్ ఉందా అని చెక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కొంత మంది అవినీతి అధికారుల వల్లే ఇదంతా జరుగుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+