Kumari aunty video: బంగారం ధర ఎంతున్నా తగ్గేదేలే; ఆమె హారం ధరెంతో తెలుసా!!
ఒక రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ విక్రయించుకునే కుమారి ఆంటీ, సోషల్ మీడియా పుణ్యమా అని స్టార్ సెలబ్రిటీగా మారిపోయి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు, ఒక సీరియల్లో కూడా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న కుమారి ఆంటీ సామాన్యులు అవాక్కయ్యేలా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.
తెగ బంగారం కొంటున్న కుమారి ఆంటీ
ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని తాకింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చెయ్యలేము అనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73 వేల 150 రూపాయలకు చేరుకుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్న బంగారం, రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిన కుమారి ఆంటీ బాగానే కొనుగోలు చేస్తున్నారు.

పెద్ద హారాన్ని కొన్న కుమారీ అంటీ
తాజాగా కుమారి ఆంటీ కళ్యాణ్ జ్యువెలర్స్ లో బంగారం కొనుగోలు చేశారు. ఓ పెద్ద స్వర్ణ హారాన్ని కొనుగోలు చేసిన కుమారి ఆంటీ ప్రతినెలా స్కీము కట్టి బంగారాన్ని కొనుగోలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక కుమారి ఆంటీ కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే. అంత పెద్ద హారాన్ని ఆమె కొనుగోలు చేశారు.
కుమారి ఆంటీ కొన్న హారం ధర తెలిస్తే షాక్
ప్రస్తుతం కుమారి ఆంటీ కొనుగోలు చేసిన ఆ హారం 10 తులాల పైనే ఉంటుందని అంచనా.. అంటే దాదాపు దాని ఖరీదు ఏడు లక్షల రూపాయల పైనే ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం కుమారి ఆంటీ బంగారాన్ని కొనుగోలు చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కల్యాణి జ్యువెల్లర్లో దగాదగాలాడే నగలు కొన్న కుమారి ఆంటీ..!!#KumariAunty #Gold #GoldPrice #GoldRates #Oneindiatelugu pic.twitter.com/Io3t39s2KM
— oneindiatelugu (@oneindiatelugu) April 6, 2024
బంగారం ధరలతో అందరికీ భయం.. కుమారీ అంటీ మాత్రం కాస్త డిఫరెంట్
ఇక ఈ వీడియో చూసినవారు కుమారి ఆంటీనా మజాకానా... ఓ సెలబ్రిటీలా ఆమె రేంజ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. విపరీతమైన ధరలతో బంగారాన్ని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు సంపన్నులు కూడా భయపడుతున్నారని, కానీ కుమారి ఆంటీ మాత్రం ఏకంగా భారీ భారీ హారాలను కొనుగోలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే కుమారి ఆంటీ కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ చమత్కరిస్తున్నారు.
కుమారీ ఆంటీకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందిగా
రోడ్ సైడ్ ఫుడ్ వ్యాపారం చేసుకునే కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆంటీకి అమాంతం అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఇక అప్పట్నుంచి కుమారి ఆంటీ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఆమె, ఆమె రేంజ్ కి తగ్గట్టు స్వర్ణాభరణాలు కొనుగోలు చేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications