లష్కర్ బోనాలకు శ్రీకారం.. బంగారు బోనం దర్శించుకునే అవకాశం
సికింద్రాబాద్ : భాగ్యనగరంలో బోనాల సందడి షురువైంది. ఈ నెల 4వ తేదీన గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. ఆ క్రమంలో ఆదివారం (07.07.2019) నాడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎదుర్కోళ్లతో బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఏడాది పొడవుగా హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బోనాల జాతర సందడి మొదలైంది. నగరంలోని బస్తీ, వాడా ముస్తాబైంది. అమ్మవార్ల ఆలయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. నెల రోజుల పాటు జరిగే బోనాల జాతర వేడుకలు కనువిందు చేయనున్నాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డీజేల హోరు, పాటలు వెరసి ఆషాఢమాస బోనాలు నగరవాసులను ఆధ్మాత్మిక తరంగంలో ఓలలాడిస్తాయి.

ఆదివారం నాడు లష్కర్ బోనాల జాతరకు శ్రీకారం చుట్టడంతో.. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పెద్దఎత్తున భక్తుల పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. బోనాల జాతరకు నాంది పలుకుతూ ఎదుర్కోళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలో బోనాల వేడుకలు ముగిసేంతవరకు మహంకాళీ ఆలయం గర్భగుడిలో బంగారు బోనం దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించారు.
గోల్కొండ బోనాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు కూడా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగదాంబ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. గోల్కొండ ప్రాంతం మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉందని తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications