హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో లాక్‌డౌన్..? లేదంటే కర్ఫ్యూ..? ఎప్పటినుంచి అంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా రావడంతో హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చారు. జనవరి చివరి వారంలో ఆ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం ఉండవచ్చని తెలిపారు. వైరస్ కట్టడికి ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.

టీకా కంపల్సరీ..

టీకా కంపల్సరీ..


అర్హులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84 ఒమిక్రాన్ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. 3 వేల 779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32 మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం టీకా కేంద్రాల్లో 15 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది.

 పెరిగి.. తగ్గిన కేసులు

పెరిగి.. తగ్గిన కేసులు

గత ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. నిన్న దేశంలో 33వేల 750 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 10వేల 846 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,95,407గా ఉంది. 4,81,893 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌ు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,45,68,89,306 క‌రోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

రాత్రి పూట కర్ఫ్యూ

రాత్రి పూట కర్ఫ్యూ

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. లాక్ డౌన్ లేదంటే నైట్ కర్ఫ్యూ విధించనున్నాయి. జనవరి చివరి వారం అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు హింట్ ఇచ్చారు.

English summary
lockdown may be imposed in telangana soon. health director srinivasa rao hinted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X