అయ్యా.. అనే పరిస్థితి లేదు.. బానిసలు లేరు.. మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ అటాక్
తెలంగాణ, ఏపీ మధ్య జల జగడం కొనసాగుతోంది. మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ కూడా ఇవాళ స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి అనిల్ అటాక్ చేయగా.. మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు.

హక్కులేదు..
శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని, జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ జల విద్యుదుత్పత్తిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార దోరణితో వ్యవహరిస్తోందని, మా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తాం.. మేం చెప్పినట్లు మీరు చేయాలి అన్నట్టు ఏపీ ప్రభుత్వ తీరు ఉందని జగదీశ్ రెడ్డి అన్నారు.

ఆపే శక్తి లేదు
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని జగదీశ్ రెడ్డి స్పష్టంచేశారు. అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని, తప్పకుండా అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం అని చెప్పారు. ఎవరో ఆర్డర్టు ఇస్తే వినాల్సిన అవసరం మాకు లేదని మంత్రి చెప్పారు. ః

చుక్కనీటిని వదులుకోం..
కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని, ఆంధ్రప్రదేశ్ దొంగదారిలో, అక్రమ పద్దతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. మూడో వ్యక్తి జోక్యం లేకుండా ఇద్దరం కూర్చోని మాట్లాడుకుందాం అని మొదట ప్రతిపాదించింది తెలంగాణ సీఎం కెసిఆర్ అని...కానీ దానిని తీసుకోవడంలో పక్క రాష్ట్ర సీఎం జగన్ విజ్ణత లోపించిందని మంత్రి జగదీశ్ అన్నారు.

బానిసలు లేరు
ఇంకా పాతరోజులు కావని.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడిందని....ఎవరి చెప్పుచేతుల్లో తెలంగాణ ప్రజలు లేరన్నార. మీ బానిసలు అధికారంలో లేరని జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు మీ ప్రాంత వాసులు బానిసలుగా చేసుకొని ఆటలు సాగించారని ... ఇప్పుడు మీ ఆటలు సాగవని..ఇకనైనా మీ కుప్పిగంతలు ఆపండి ఆయన ఏపీ మంత్రులకు హితవు పలికారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications