అవి కూడా ఆన్‌లైన్ లోనే.. సూర్యాపేట అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు..
సూర్యాపేటలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆన్‌లైన్ విక్రయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. మాంసం విక్రయాలను కూడా ఆన్‌లైన్ ద్వారానే జరపాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని తాజా పరిస్థితులపై ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితర అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని అధికారులకు సూచించారు. మటన్, చికెన్ సహా అన్ని విక్రయాలను ఆన్‌లైన్ ద్వారా జరపాలని ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి పాలు, కూరగాయలు వార్డుల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ కొనుగోళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఫార్మాసిస్టులను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.

Recommended Video
సూర్యాపేట శివారు,పరిసర ప్రాంతాల ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందిపడుతున్నారని.. ఆ సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. పట్టణ శివార్లలో ఉన్న ఎస్వీ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో హోల్ సేల్ దుకాణాలను ఏర్పాటు చేసి.. వారి అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో పట్టణం నుంచి ఎలాంటి రాకపోకలు ఉండవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో.. ముస్లిం సోదరులకు పండ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications